Thursday, 5 November 2026

బీజేపీ నేతల అక్రమ అరెస్టులు

 

 

 

 

మెట్ పల్లి జనంసాక్షి :

రాజ్యాంగాన్ని మార్చాలి అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలకు నిరసనగా జగిత్యాల జిల్లాలో తల పెట్టిన బిజెపి మహార్యాలీ కార్యక్రమానికి మెట్ పల్లి నుండి తరలి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు దీనిని బీజేపీ నాయకులు ఖండిస్తూ, రాష్ట్రంలో నిజాం పరిపాలన నడుస్తోందని ప్రశ్నించిన నాయకులని అక్రమ అరెస్టు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల వల్ల ఉద్యమం ఆగదని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని నాయకులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి పట్టణాధ్యక్షుడు బోడ్ల రమేష్ బీజేవైఎం రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనీకేలనవీన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్ జిల్లా నాయకులు సుఖేందర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శివ గౌడ్ సదాశివ్ కోయ్యల లక్ష్మణ్ మండల అధ్యక్షులు రాజ్ పాల్ రెడ్డి భోగ గంగాధర్ సాగర్ బీజేవైఎం నాయకులు బీజేవైఎంపట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్ బీజేవైఎం జిల్లా నాయకుల సుంకేటి విజయ్ రమేష్ యాదవ్ అరిగెల అజయ్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడుసుంకే అశోక్ బీజేవైఎం నాయకులు కలికోట శ్రీకాంత్ కుడుకల రఘు బోడ్ల గౌతమ్ యమవినోద్ పసునూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు