Wednesday, 4 November 2026

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి

మెదక్: జిల్లాలోని కొండపాకలో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పి మారుతీ వ్యాను కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్ధిపేట ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *