Thursday, 5 November 2026

మెరుగవుతున్న సౌకర్యాలతో

ఆస్పత్రులకు పెరుగుతున్న రోగుల తాకిడి

హైదరాబాద్‌,జూలై14(జ‌నం సాక్షి): జిల్లాల్లో ప్రాంతీయాస్పత్రుల స్థాయి పెరిగింది. ఔకర్యాలు పెరిగాయి. ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ది చేస్తున్నారు, మౌళిక వసతులు పెంచారు. దీంతోమెరుగైన వైద్యసేవల కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సౌకర్యాలు లేక ప్రసూతి సేవలందడం లేదన్న విమర్శలు తగ్గాయి. ఇటీవల మంత్రి లక్ష్మారెడ్డి పలు ఆస్పత్రులను సందర్శించి అభివృద్దికి హావిూ ఇస్తున్నారు. నిధులు విడుదల చేస్తూ సౌకర్యాలు మెరుగు పడేలా చేస్తున్నారు. మరోవైపు కెసిఆర్‌ కిట్‌ పథకం ప్రకటించిన తరవాత ప్రసూతి కేసుల సంఖ్య పెరిగింది. ప్రజలు కూడా ప్రభుత్వాసుపత్రినే ఆశ్రయిస్తున్నారు. దీంతో వచ్చే రోగుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. రాష్ట్రంలోనే ఇతర ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ రోగులు ఎక్కువగా వస్తున్నారు. ఇట్రామాకేర్‌ సేవలు, రక్తనిధి కేంద్రం, సదరం శిబిరాల్లో అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ, ఏఆర్‌టీ తదితర సేవలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మార్చి రోగులకు ప్రయోజనకరంగా చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా నిధులు వెచ్చించి వైద్య సేవలందించేందుకు ఆస్కారం కలిగించారు. మెదక్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, పాలయమూరు సహా అనేక జిల్లాల్లో రోగుల తాకిడి ఉంది. వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటైన ఆస్పత్రికి గతంతో పోలిస్తే చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు ప్రసూతి వైద్యం ఇక్కడే అందిస్తుండటంతో పరిస్థితి మెరుగయ్యింది. వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తున్న ఆస్పత్రులకు తోణంపోస్టులను మంజూరు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవల వసతులు పెరిగాక ఒక్కో ఆస్పత్రికి రోజుకు 10 ప్రసవ కేసులు వస్తుంటాయి. నెలకు 300 వరకు సాధారణ, శస్త్రచికిత్స ప్రసవాలు చేస్తున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకటి, రెండు కేసులు మినహా ప్రసవాలు జరగడం లేదు. వైద్య రంగానికి నిధుల కేటాయింపులకు అధిక నిధులు కేటాయిస్తే తద్వారా మెరుగైన సేవలందించడంలో ఇబ్బందులను అధిగమించే వీలుంటుంది. జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటే స్థానిక వాసులకు మేలు జరుగుతుంది. అధికారుల

ఆదేశాల మేరకు రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యసేవలు అందించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.