తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం

9రోజులపాటు భక్తులకు దూరంగా శ్రీవారు

మహాసంప్రోక్షణ కోసం టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం

తిరుమల,జూలై14(జ‌నం సాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. వవిధ సంప్రోక్షణ కార్యక్రమా లసందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిచిపోనుంది. చరిత్రలో తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంపై చర్చించేందుకు ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన పాలకమండలి ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నారు. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండడం.. భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపై 12వ తేదీ నుంచి వైదిక కార్యక్రమాలు జరపాల్సి ఉండగా 9వ తేదీ నుంచే భక్తుల రాకను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. దీనిపై ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో సింఘాల్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అప్పట్లో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని తెలిపారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఒకవేళ పరిమితంగా అనుమతించినా.. రోజుకు 20 వేలమందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందని, మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి తోడు 10, 11 తేదీల్లో ఒకవేళ భక్తులకు దర్శనానికి అనుమతిస్తే రెండు రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేసినట్లు తెలిపారు.

మహాసంప్రోక్షణ క్రతువు ఉన్నందున 9 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు 17 ఉదయం 6 గంటల వరకు వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించకూడదని ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణపై చర్చించేందుకు టీటీడీ పాలకమండలి శనివారం భేటీ అయ్యింది. మహాసంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహాకు అనుగుణంగా ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది. ఒకవేళ పరిమితంగా అనుమతించినా రోజుకు 20వేల మందికి మాత్రమే దర్శనం అవకాశం కలుగుతుందని మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని అంటోంది.

 

తాజావార్తలు