మెరుగైన వైద్య సేవలను అందించండి.

రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేదిశగా చర్యలు.
వైద్యాధికారులు సమస్యపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలి.
 జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్.
యాలాల అక్టోబర్ 15(జనంసాక్షి)యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని శనివారం సందర్శించి రోగులకు కావలసిన వైద్య సదుపాయాలను అందిస్తున్న తీరును, గ్రామంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను ఎంపీపీ బాలేశ్వర్ గుప్తాతో కలిసి పరిశీలించారు. అనంతరం తాండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జుంటుపల్లి గ్రామస్తులను కలసి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని జిల్లా వైద్యశాల అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో వైద్యులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
Attachments area