:శామీర్ పేట్, జనం సాక్షి :ఆదివారం
రోజు మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా ఎంపిపిల ఫోరం అధ్యక్షులుగా శామీర్ పేట్ మండల ఎంపిపి దాసరి ఎల్లుబాయిబాబును నియమీంచారు.మంత్రి చామకూర మల్లారెడ్డి నామీద నమ్మకంతో మేడ్చల్ జిల్లా ఎంపిపిల ఫోరం అధ్యక్షులుగా నియమీంచినందుకు వారికి క్రృతఘ్నతలు, ధన్యవాదాలు తెలియజేశారు . మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశాలమేరకు అనునిత్యం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తాను. అధ్యక్షులుగా ఎన్నుకున్న ఎంసి పల్లి మండల ఎంపిపి హారికా మురళి గౌడ్ , కీసర మండల ఎంపిపి ఇందిరా లక్ష్మి నారాయణ , మేడ్చల్ మండల ఎంపిపి రజితా రాజమల్లా రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు .అలాగే వైస్ చైర్మన్ వెంకటేష్ , మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్ రెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖరరెడ్డి , మద్దుల శ్రీనివాస్ రెడ్డి , టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ , టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు .
14ఎస్పీటీ -1: ఎల్లు భాయి ని సన్మానిస్తున్న మంత్రి
మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరమ్ అధ్యక్షులుగా ఎల్లు భాయి బాబు




