మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి.. వెదురు బొంగు ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించుకోవడానికి ప్రోత్సహించాలి.

బోయిన్ పల్లి సెప్టెంబర్ 18 (జనం సాక్షి) ప్రపంచ వెదురు దినోత్సవన్ని పురస్కరించు కొని మేదరులు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల మేదర సంఘం ఆధ్వర్యంలో వెదురు వస్తువుల తో ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకి చేరుకొని ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని మేదర్లను ఎస్టీ జాబితా లో చేర్చాలని అన్నారు.మేదరి బంధు పథకం అమలు చేయాలని వెదురు రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.మేదరులకు 5 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వ కార్యాలయంలో వెదురు ఉత్పత్తులు వాడకాన్ని ప్రోత్సహించాలని,మండల మేదరి సంఘం భవనానికి ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని,50 సంవత్సరాల నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలి ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుల్ల బాలయ్య, గౌరవాధ్యక్షులు గుల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు రఘు నాయకులు మహేష్ ,నరేష్, దేవయ్య, గంగరాము, శ్రీనివాస్, బుచ్చయ్య, భీమయ్య, మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు