మైనర్ బాలికపై అత్యాచారం..

– గర్భం దాల్చిన మైనర్ బాలిక.
– కామందులను శిక్షించాలంటున్న కుల సంఘాలు
ఊరుకొండ, జనంసాక్షి:
ఊరుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ తన కూతురు(15) మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకొని అనుభవించగా గర్భం దాల్చిందని.. విషయం తెలుసుకున్న కన్నతల్లి లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ గోడు విన్నవించారు. గర్భం దాల్చిన విషయం తెలిసిన మహిళ (తల్లి) వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై లెనిన్ తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

తాజావార్తలు