Wednesday, 4 November 2026

ధర్మ సమాజ్ పార్టీ సభను జయప్రదం చేద్దాం- డి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్

సబ్బండ కులాల తరఫున రాజకీయ సమరానికి సిద్ధపడుతున్న ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఆవిర్భావ సభను జయప్రదం చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని ధర్మ సమాజ్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12న శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో ధర్మ సమాజ పార్టీ సిద్దిపేట జిల్లా ఆవిర్భావ సభ ఉంటుందని అన్నారు. తెలంగాణలో 10శాతం లేని వెలమ రెడ్ల రాజ్యాన్ని దింపి 90శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నెలకొల్పేందుకే ధర్మసమాజ్ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. అంతకు ముందు డీఎస్పీ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ గారికి భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలకనున్నట్లుగా తెలిపారు. ముస్తాబాద్ చౌరస్తా నుంచి బిజెఆర్ చౌరస్తా వరకు 500 బైకులతో ర్యాలీ ఉంటుందని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రవిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు సదన్ మహారాజ్, జిల్లా నాయకులు డి బి రాజు, పరమేశ్వరి మహారాణి, చందు, భాస్కర్, బాబు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షులు
రవిబాబు మహరాజ్
DSP సిద్దిపేట జిల్లా కమిటీ