మైనారిటీ స్కాలర్ షిప్ దరఖాస్తుకు గడువు తేదీ పెంపు

హర్షం వ్యక్తం చేసిన మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా.

చండ్రుగొండ జనంసాక్షి : అక్టోబర్ 15) కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ వారు 2022-2023 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రీ మెట్రిక్, బేగం హజరత్ మహాల్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కం మీన్స్ స్కాలర్ షిప్ లకు గడువు తేదీని నెల రోజులపాటు పెంచాలని కోరుతూ జాతీయ మైనారిటీ కమిషన్, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా మైనారిటీ అదికారులకు యాకూబ్ పాషా వినతిపత్రాలు అందించిన నేపథ్యంలో ఈ నెల31 వరకు ఆ స్కాలర్షిప్ ల
గడువు తేదీని పెంచుతూ మైనార్టీ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో www.scholarships.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, సూచించారు ఇతర వివరాలకు 8520860785అనే నెంబర్ను సంప్రదించాలని సూచించారు.