హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. శాసన సభలో ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉప ప్రణాళికపై మంత్రి వర్గ ఉపసంఘం చేసిన అన్ని సిఫార్సులను ఆమోదించాలని కోరారు. ప్రభుత్వం మైనార్టీల నిధులను కూడా దారిమళ్లించిందని మండిపడ్డారు.




