మైలారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన సుధాకర్ రావు.

కోడేరు జనం సాక్షి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడూరు మండలం పరిధిలోని మైలారం గ్రామంలో ఎల్లేని సుధాకర్ రావు కు ఘన స్వాగతం పలికిన గ్రామ యువకులు గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జి. భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో సోమశీల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం కొరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే మంజూరు చేసిందని ఎల్లేని సుధాకర్ రావు తెలిపారు. మైలారం గ్రామానికి విచ్చేసిన ఎలేని సుధాకర్ రావు కు గ్రామ యువకులు కోడేరు మండల పరిధిలోని వివిధ గ్రామాల యువకులు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో కొల్లాపూర్ కోటపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ఎల్లేని సుధాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.