మేళ్లచెరువు మండలం( జనంసాక్షి న్యూస్ ): మేళ్లచెరువు మహా సిమెంట్, మై హోం ఇండస్ట్రీస్ శ్రీ నగర్ కాలనీ యందు 51 వ జాతీయ భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని సేఫ్టీ రన్ ఆదివారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సేఫ్టీ రన్ కార్యక్రమాన్ని ప్లాంట్ హెడ్ శ్రీనివాస రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51వ జాతీయ భద్రత వారోత్సవాలు గురించి కాలనీవాసుల అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే మన నిత్య జీవితంలో భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. మనం చేసే ప్రతి పనిని అవగాహనతో ,భద్రతతో చేయాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యోగులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. విజేతలను ప్రకటించడం జరిగిందన్నారు. వీరికి భద్రతా వారోత్సవాల ఫైనల్ డే ఫంక్షన్ రోజు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ హెడ్ మహేశ్వరరావు, హెచ్ .ఆర్. హెడ్ నాగేశ్వరరావు ,సివిల్ హెడ్ శ్రీనివాస్ రావు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మై హోం లో సేఫ్టీ రన్




