Monday, 2 November 2026

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం

మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి): 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌ రావు నిర్ణయించారు.అవసరాన్ని బట్టి మరికొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.మొక్కజొన్న మద్దతు ధర 1425 రూపాయలకన్నా తక్కువకు రైతులు అమ్ముకోవద్దని మద్దతు ధర లభించిన తర్వాత అమ్మాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.మొక్కజొన్న, పెసలు తదితర పంటలు,దిగుబడి, వాటి కొనుగోలు కేంద్రాల గురించి వ్యవసాయ, మార్కెటింగ్‌,మార్క్‌ ఫెడ్‌ అధికారులతో సెక్రెటేరియట్‌ లో హరీశ్‌ రావు శుక్రవారం సెక్రెటేరియట్‌ లో సవిూక్షించారు.వ్యవసాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ జగన్మోహన్‌, సెక్రటరీ పార్థసారధి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ బాయి, బోయినపల్లి మార్కెట్‌ సెక్రటరీ పద్మ హర్ష తదితరులు పాల్గొన్నారు.