Wednesday, 4 November 2026

మొబైల్ ఇ.ఎన్.టి, హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభం

 ఖైరతాబాద్ : ఆగస్ట్ 30 (జనం సాక్షి) గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఇ.ఎన్.టి వైద్యం చేయించుకోలేని వారికోసం రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్(రోటరీ డిస్ట్రిక్ట్ 3150) ఆధ్వర్యంలో మొబైల్ ఇ.ఎన్.టి, హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించారు. దీనికి ‘మా’ ఇ.ఎన్.టి సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి ఈ మొబైల్ ఇ.ఎన్.టి, హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ఎంతగానో ఉపయోగ పడుతుందని రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఎలక్ట్ పి.డి.జి అనిరుధ రాయ్ చౌధురి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన చేతుల మీదుగా మొబైల్ ఇ.ఎన్.టి, హియరింగ్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ ఒక ఇ.ఎన్.టి డాక్టర్, టెక్నికల్ టీం, ఆడియాలజిస్ట్ ఈ వ్యాన్ లో అందుబాటులో ఉంటారన్నారు. వారు రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పీహెచ్ సీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొబైల్ వ్యాన్ సహాయంతో స్క్రీనింగ్ జరుపుతారని, దీని ద్వారా పిల్లల్లో వినికిడి సమస్యలు త్వరగా గుర్తించేందుకు వీలు కలుగుతుందన్నారు. వారికి అవసరమైన ట్రీట్ మెంట్ సకాలంలో అవకాశం ఉంటుందన్నారు. సునీత జి.కుమార్(‘మా’ ఇ.ఎన్.టి సి.ఎం.డి), డిజీ రాజ శేఖర్ రెడ్డి, డీజీఈ శంకర్ రెడ్డి, డీజీఎన్ శరత్ చౌదరి, పీడీజీ రవి వడ్లమాని, పీడీజీ రవీ దోత్రే, పీడీజీ సంగ్రామ్ పాటిల్, డి.ఆర్.ఎఫ్.సి పీడీజీ రమేష్ వంగల, పీడీజీ హన్మంత్ రెడ్డి, ఆర్ టీన్ సాయి కుమార్, ఆర్ టిఎన్ ఉదయ్ పిళని తదితరులు ఇందులో పాల్గొన్నారు. వినికిడి సమస్యలు ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ మొబైల్ వ్యాన్ దోహదపడుతుందని ‘మా’ ఇ.ఎన్.టీ సిఎండి సునిత జి.కుమార్ వెల్లడించారు. రోటరీ ఇంటర్నేషనల్ చొరవను ప్రశంసించారు.