మొబైల్ హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలి.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 24
రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కొరకు ఏర్పాటు చేసిన మొబైల్ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ వెల్ ఫెర్ అస్సోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో తెలంగాణ ప్రభ్యుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసిన మొబైల్ హెల్త్ క్యాంపు ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.సీనియర్ సిటిజన్స్ అనారోగ్య సమస్యలకు గురికాకుండా వ్యాయామం,యోగ,వాకింగ్ తో పాటు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరీక్షలను చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రామూయాదవ్,తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు నర్సింహా రావు,మల్కాజిగిరి సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,అచ్యుత్ రావు తదితరులు పాల్గొన్నారు