మొహర్రం వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట – గిరిజనులు మొహర్రం జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం


వీర్నపల్లి, జూలై 29 ( జనంసాక్షి): మొహర్రం పండుగను గిరిజనులు ఆనవాయితీగా పీర్ల మస్జిద్ ను నిర్మించుకోవడం సంతోషమని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. జవహర్ లాల్ తాండ గ్రామ పరిధిలో ఉన్న బంగి రెడ్డి తండాలో శనివారం నాడు జరిగిన పీర్ల పండుగకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు మ్రొక్కిన కోర్కెలను తీరిస్తే పీర్లను వెండితో చేయించి తమ మ్రొక్కులను చెల్లించుకునే ఆనవాయితీ ఇక్కడ కొన సాగుతుందన్నారు. స్వంత నిధులతో పీర్ల మస్జిద్ ను నిర్మించుకోవడం గిరిజనుల ఐక్యతకు నిదర్శనమని తోట ఆగయ్య అన్నారు. మారుమూల గ్రామంలో మొహర్రంను జరుపుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఎంపిటిసి పద్మసెవ్య నాయక్, జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు