మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగింది……
*యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్……
టేకుమట్ల.సెప్టెంబర్15(జనం సాక్షి)భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో నిరుద్యోగం చాలా పెరిగిపోయిందని జయశంకర్ భూపాలపల్లి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ అన్నారు.ఈ సందర్భంగా ఈ నెల 17న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ నిరుద్యోగ దినంగా ప్రకటించడం జరిగిందని అన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగి దేశ యువత నిరాశ నిస్రుహలతో నలిగిపోతూ సమాజంలో గుర్తింపు లేని వాళ్ళుగా నిరుద్యోగులు మిగిలిపోతున్నారని దీనికి మోడీ ప్రభుత్వమే కారణమని యువజన కాంగ్రెస్ నిరుద్యోగ దినంగా మోడీ జన్మదినాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం తో ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుని కూడా వారి చదువు తగ్గ ఉపాధి వాళ్లకు లభించడం లేదని మోడీ ప్రభుత్వం దేశంలో వివిధ రంగాలలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయకుండా,ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశ యువతను మతం,కులం ప్రాంతం అనే విద్వేషాలు సృష్టించి యువతను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ దేశాన్ని సంక్షోభం వైపు మళ్లిస్తున్నారు అన్నారు.బిజెపి చేస్తున్న నిరుద్యోగ వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ మోడీ జన్మదిన సందర్భంగా వివిధ రూపాల్లో నిరుద్యోగులందరూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ దినాన్ని నిరసనను తెలియజేయాలని జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నిరుద్యోగ దినాన్ని జరిపి దేశంలో ఉన్న నిరుద్యోగ పక్షాన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల నాయకులు పెరుమండ్ల క్రాంతి,వైనాల యశ్వంత్,సురేష్,తదితరులు ఉన్నారు.