ఎల్బీనగర్ (జనం సాక్షి ) పుట్టినరోజు వేడుకలు విద్యార్ధుల మధ్య జరుపుకోవడం సంతోషదాయకం అని బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ , ఎల్బీనగర్ నియోజకవర్గం తెరాస సీనియర్ నాయకురాలు ముద్దగొని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ అన్నారు. . దంతోజు శ్రీనివాస చారి కుమారుడు శివశంకర్ చారి 8వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం వనస్థలిపురంలోని శాంతి నికేతన్ ఫౌండేషన్ లో పారు . దంతోజు
శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .
శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి బి.ఎన్.రెడ్డి మాజీ కార్పొరేటర్ ‘ఎల్బీనగర్ నియోజకవర్గం తెరాస సీనియర్ నాయకురాలు ముద్దగొని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ , తెలంగాణ వైయస్సార్ టిపి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ వనమాల ప్రవీణ్ కుమార్ హాజరై విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసిక వికలాంగుల విద్యార్థులను ఆదుకోవడంలో ముందుండాలని తెలిపారు . దంతోజు
శ్రీనివాసాచారి కుమారుడి శివశంకర్ పుట్టినరోజు వేడుకలు శాంతి నికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో అందాల రాజశేఖర గౌడ్ పండాల రాజశేఖర్ గౌడ్ సాల్వ చారి నెల్లోజు మరియు పలు బీసీ నాయకులు పాల్గొన్నారు
Attachments area




