మోడీ పాలనలో వంట గదుల్లో మంట ఎల్.పి.జి గ్యాస్ ధర 50రు.పెంపుపై తెరాస శ్రేణులు నిరసన
కోటగిరి జూలై 8 జనం శాక్షి:-పెంచిన ఎల్.పి.జి గ్యాస్ సిలెండర్ ధరలను వెంటనే తగ్గించలని కోరుతూ కోటగిరి మండల టి.అర్.ఎస్ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసనలు తెలిపారు.ఈ సందర్భంగా మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఏజాస్ ఖాన్ మాట్లడుతూ గడిచిన 8 ఎండ్లలో దేశ ప్రధాని మోదీ పాలన అచ్చేదినాలుగా లేవు అవి జనాలు సచ్చే
దినాలుగా ఉన్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వ పాలనలో పేద,మధ్య తరగతి ప్రజలకు పెట్రోల్,డీజిల్,గ్యాస్,నిత్యా వసర ధరలు గడియ గడియకు పెరుగుతు పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయి.ఇటీవల గ్యాస్ ధర 50 రు.
పెరుగుదల పై గృహిణులు వంట గదుల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.ఇకనైనా కేంద్ర గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునిత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్,మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య అరవింద్,సర్పంచ్ ఫోరం కన్వీనర్ పత్తి లక్ష్మణ్,సింగిల్ విండో ఛైర్మెన్ కూచి సిద్దు,సలీం,శోభ, గంగామణి,మోతపెటిరవి,కులకర్ణి అనిల్, చాకురి గంగాధర్,శివరాజ్ పాటిల్, సాయిలు,లక్ష్మణ్ పటేల్,గంగా ప్రసాద్ గౌడ్,జుబేర్,బాబు ఖాన్,సంజుసీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Attachments area