Wednesday, 4 November 2026

మోహన్‌బాబుకు ఊరట : కమిటీపై స్టే

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ సినిమా వివాదంలో ఆ సినిమా నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు ఊరట లభించింది. ఈ సినిమాను పరీక్షించడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన గురువారం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ సినిమాతోపాటు ఎ వుమెన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం అనే సినిమాపై కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు సమీక్షా కమిటీలపై స్టే విధించింది. ఈ కమిటీల ఏర్పాటును కోర్టు తప్పుబట్టింది. సినిమాలో తప్పొప్పులను పరిశీలించడానికి ప్రత్యేకంగా సెన్సార్‌ ఉండగా మళ్లీ కమిటీల అవసరం ఏమిటని ప్రశ్నించింది. సెన్సార్‌ ఆమోదించిన తర్వాత మళ్లీ సమీక్షించే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *