Tuesday, 3 November 2026

మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 23
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రాయల్ ఎంక్లేవ్ లోని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అధికారులతో కలిసి పర్యటించారు. ముఖ్యంగా కాలనీవాసులు డ్రైనేజీ వ్యవస్థ అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీవాసుల సౌకర్యాలను దశలవారీగా పరిష్కార మార్గంలో చూపుతామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. డివిజన్లోని ప్రతి కాలనీకి డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం విధి స్తంభాలు సిసి రోడ్లు శానిటేషన్ వివిధ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డిఈ మహేష్, వాటర్ వర్క్స్ డీజిఎం సాంబయ్య, మేనేజర్ రమేష్, ఎలక్ట్రికల్ ఏఈ స్వాతి, సిబ్బంది స్థానిక డివిజన్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, సాంబయ్య, కొండల్ రెడ్డి, వెంకటేష్, కాలనీ అధ్యక్షులు వై శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ అభినయ, ప్రభాకర్ రెడ్డి, రామంతచారి, స్వప్న, గీత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area