యాదవ సంఘం ఆధ్వర్యంలో క్షిరాభిషేకం..
నిధుల మంజూరు పట్ల యాదవులు హర్షం
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 14 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ యాదవ సంఘం భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల బుధవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో గ్రామ కచ్ఛిరు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చిత్ర పటాలకు క్షిరాభిషేకం చేశారు. నిధులు మంజూరు చేసి యాదవ కుల సంక్షేమానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సందబోయిన వెంకటేష్, తరికంటి కొమురయ్య, కన్నబోయిన శ్రీనివాస్, దొండకాయల సంపత్, పోచబోయిన పరామశేఖర్, మండపల్లి కిషన్, పోర్ల శ్రీను, బాబు, రాజు,యాదవ కులస్తులు పాల్గొన్నారు.
Attachments area