ఆలయ భూముల్లో మట్టి నీ తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
కొమురవెల్లి జనం సాక్షి
బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ
కొమురవెల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి ఆలయ ఈఓ గారితో దేవస్థానానికి సంబంధించిన భూముల నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సాక్షాదారులతో సహా దేవస్థానం ఈవో గారికి అదేవిధంగా మండల రెవిన్యూ అధికారులకు పోలీసు సిబ్బందికి చూపించడం జరిగింది దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది
ఈరోజు భారతీయ జనతా పార్టీ దెబ్బకు మండల రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అదేవిధంగా దేవస్థానం ఈవో ఆ భూములకు సంబంధించిన సర్వేను నిర్వహించి హద్దులను పాతడం జరిగింది అదేవిధంగా కాల్వకు అడ్డంగా వేసిన పైపులను తొలగించడం జరిగింది
భవిష్యత్తులో ఆలయానికి సంబంధించిన భూములపై ఎవరు ఆక్రమించాలని చూసిన భారతీయ జనతా పార్టీ కచ్చితంగా అడ్డుకోని తీరుతుందని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి కొమురవెల్లి మండల అధ్యక్షులు దండ్యాల వెంకటరెడ్డి జేఏసీ కన్వీనర్ నాగరాజు మండల ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పంజాల మల్లేశం ఉపాధ్యక్షులు కర్ణాకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎక్కల దేవి మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు