హైదరాబాద్, ఆగస్టు 24 : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు యాసిన్ భక్తల్‌ను విచారించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు హాలులో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు. న్యాయమూర్తి ఎదుట భత్కల్‌ను జైలు అధికారులు హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో కారాగారం వద్ద ఆక్టోపస్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితుల విచారణకు చర్లపల్లి జైలులో ప్రత్యేక కోర్టు విచారణ సాగిస్తోంది. జైలు వద్ద ప్రతీ వాహనాన్ని ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా




