ఆఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి ,బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. శామీర్ పేట లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 91 వ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు భారత దేశానికి తను చేసే సేవలో ఆయన పెళ్లి వయసు కూడా దాటి పోయే వరకు ఆయన గమనించక పోవటం దేశం పట్ల,దేశ ప్రజల పట్ల ఆయనకున్న మమకారమే నని అన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలు పాటించి భారతావని ప్రతిష్టను ఇనుమడింప జేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, ఆంజనేయులు, శ్రీకాంత్,శివగౌడ్,క్రిష్ణ, ఫారూఖ్,అజీం తదితరులు పాల్గొన్నారు.
15 ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు
యువత అబ్దుల్ కలాం ఆశయాలు అలవర్చు కోవాలి




