యూనిఫాంల పంపిణీ.

నెన్నెల, అక్టోబర్ 20, (జనంసాక్షి)
మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయివేటు పాటశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్లయ్య, ఉపాద్యాయురాలు అనూష, ఉప సర్పంచ్ నారాయణ, వార్డు సభ్యుడు ఉమాదేవి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.