రంగసాయిపేటలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24 (జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 42 వ డివిజన్ రంగసాయపేటలో గురువారం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ క్రమంలో రెండు కోట్ల 94 లక్షల ముఖ్యమంత్రి నిధుల తో రోడ్స్ మోరీల నిర్మాణానికి అదేవిధంగా వివిధ కులాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద, అలాగే గంగపుత్ర కులానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి రూపాయల 30 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగసాయిపేట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు భవిష్యత్తులో మరిన్ని కోట్ల నిధులతో కావాల్సిందని అన్ని రకాల పనులు చేయనున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుండు చందన, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, కిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కెడల జనార్ధన్, కొంతం తార, నాయిని అశోక్, శంకేష్ యాదగిరి, మధుసూదన్, చందా మనోహర్, గుర్రాల మోహన్, కర్ర కుమార్, లక్కాకుల సతీష్, జక్కం దామోదర్, బజ్జురి వీరేశం, శంఖేష్ కుమార్ పరికిపండ్ల ఈశ్వరయ్య, కొంతం మోహన్ తదితరులు పాల్గొన్నారు.