రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ పర్వేజ్

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మన అందరి ప్రియతమ నాయకుడు, ఎంతోమంది హృదయాలను దోచుకున్న మచ్చలేని మహారాజు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి పుట్టినరోజు సందర్బంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ పర్వేజ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి, ఘనంగా సన్మానం చేసారు . ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ పర్వేజ్ మాట్లాడుతూ నిరంతరం కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి పాటుపడుతున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు



