హైదరాబాద్,జూన్15(జనం సాక్షి): రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. 600 మసీదుల వద్ద డేగ కన్నుతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. 50 మసీదులు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని, పాతబస్తీ, మాదన్నపేట్, మక్కామసీదు, విూరాళ ఈద్గా, ప్రధాన మసీదుల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అంజనీకుమార్ చెప్పారు.




