Wednesday, 4 November 2026

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జనం సాక్షి నర్సంపేట

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పిలుపు మేరకు 75 స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నేడు నర్సంపేట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కేంద్రంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్నినర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
భారతదేశంలో ఎందరో మహనీయులు త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం వచ్చింది.
వారి త్యాగాలను మరవకుండా వారికి గుర్తుగా ఈ రోజు నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జిల్లా హాస్పటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది
రక్తదానం చేసిన యువకులకు మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి, హాస్పిటల్ సిబ్బందికి, పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీఎం డి ఎం హెచ్ ఓ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సూపరిండెంట్, అడిషనల్ కలెక్టర్, చైర్మన్, కమిషనర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు, పార్టీ యూత్ అధ్యక్షులు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.