రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : రక్షణ సిబ్బందితో మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సి.హెచ్.పి. లో సేఫ్టీ జీ.ఎం. జాన్ ఆనంద్ గురువారం రక్షణ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ
సేఫ్టీ మేనేజ్ మెంట్ పై ఆర్కేపి సి.హెచ్.పి. లో ఇన్స్ పెక్షన్ టీం తో వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు.
జీరో హామ్స్ పై, హజర్డ్ సొల్యూషన్స్ పై అవగాహన కల్పించడమే ఇన్స్ పెక్షన్ ముఖ్య ఉద్దేశ్యం ఆని వారు తెలిపారు.
గనిలో, పనిలో, మదిలో, మైన్లో, సర్ఫేస్ లో, ఎక్కడైనా, ఎప్పుడైనా రక్షణతోనే పనిచేయడమే మన విధి అని వారు వివరించారు.
రక్షణ పాటించడం ప్రతీ కార్మికుడు తన బాధ్యతగా గుర్తుంచుకొని, తనకేమైనా ప్రమాదం జరిగితే కుటుంబ పరిస్థితిని ధృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రక్షణ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఓదేలు, డీ.జి.ఎం. సిఎస్పీ బాలాజీ భగవతి ఝా, డీ.వై.ఎస్.ఈ. ఏ.ఛంధ్రమౌళి, రీజియన్ సేఫ్టీ రామనాథం ,పిట్ సెక్రటరీలు శంకర్రావు, సంజీవ్, సూపర్ వైజర్స్ గంగాధర్, కల్లెపెల్లి శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.