మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ’ధమాకా’. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఏఏఆర్ట్స్, పీపుల్స్ విూడియా ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణంలో చిత్రం తెరకెక్కుతోంది. పలు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రినాథరావు.. రవితేజ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాతో అభిమానులకి డబుల్ ధామాకా
ఇవ్వబోతున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి వేలెంటైన్స్ డే నాడు విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో నాలుగో షెడ్యూల్ పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. రవితేజ, జయరాం, శ్రావణ్, సవిూర్ తదితర నటులు, చిత్ర బృందంలోని మొత్తం సభ్యులు ఈ సందర్భంగా దిగిన ఫోటోను షేర్ చేశారు. కామెడీ చిత్రాలు తీయడంలో చెయితిరిగిన దర్శకుడు నక్కిన, కామెడీ టైమింగ్ లో తిరుగులేని రవితేజ
కలిస్తే ఆ సినిమా ఎంతటి హిలేరియస్ గా ఉంటుందో వేరే చెప్పలా? పేరుకు తగ్గట్టుగానే ఈ మూవీ ప్రేక్షకులకు కామెడీ ధమాకాను అందిస్తుందని చెప్పుకోవచ్చు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో మాస్ మహారాజా ఏ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటాడో చూడాలి.




