మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలోని చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే.. మెహర్ రమేశ్ దర్శకత్వంలోని ’భోళాశంకర్’ షూటింగ్ కూడా వాటికి సమాంతరంగా జరుగుతోంది. అజిత్ నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ’వేదాళం’ కు ఇది అఫీషియల్ రీమేక్. గ్యాంగ్ స్టర్ అయిన హీరోకి చెª`లలెలు కానీ ఓ చెª`లలెలితో అనుబంధం ఏర్పడుతుంది. ప్రాణం కన్నా మిన్నగా భావించే ఆ చెª`లలెలికే కష్టమొస్తే అప్పుడా అన్న ఎలా రియాక్ట్ అయ్యాడు? తన చెª`లలెల్ని ఎలా రక్షించుకున్నాడు అన్నదే కథాంశం. ఒరిజినల్ వెర్షన్లో అజిత్ చెª`లలెలిగా లక్ష్మీ విూనన్ నటించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. ఇక ’భోళాశంకర్’ లో కథానాయికగా తమన్నా, చిరు చెª`లలెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల గురించి ఓ రూమర్ సోషల్ విూడియాలో వేగంగా స్పెడ్ర్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ’భోళాశంకర్’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అప్పటికి ఆచార్య చిత్రం విడుదలైపోతుంది. ఏప్రిల్ 29న ఆ సినిమా విడుదలవుతుండగా.. సరిగ్గా 6 నెలల గ్యాప్ తో.. అంటే అక్టోబర్ లో భోళాశంకర్ ను విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు నిర్మాతలు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివరాత్రికి విడుదల చేసిన ’భోళాశంకర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన దక్కిన నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చిరుని చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడట దర్శకుడు మెహర్ రమేశ్.




