హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): నగరంలోని రవీంద్ర భారతిలో శనివారం కవితాంజలి కార్యక్రమం జరగనుంది. ప్రజాకవి కాళోజి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డ్ దిశగా కొనసాగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా కవితాంజలి కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. కవితాంజలిలో అంశం ఏదైనా గానీ అచ్చు అయిన కవితను మాత్రమే చదవాలి. కనీసం 5 నిమిషాల పాటు కవితను చదవాలి. ఒకవేళ కవిత చిన్నదిగా ఉంటే చదవడం రిపీట్ చేయవచ్చు.




