సిర్సాలో ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయాన్ని అధికారులు జల్లెడ పడుతున్న నేపథ్యంలో సిర్సా జిల్లాలో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు నిలిపివేశారు. డేరా సవిూప ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్త కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హర్యానా ¬ంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.ఈ నెల 10 తేదీ వరకు సిర్సా జిల్లా వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ, సీడీఎంఏ, జీపీఆర్‌ఎస్‌ సహా అన్ని మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో పాటు అన్ని ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేశారు. దీంతో ఒక్క ఫోన్‌ కాల్స్‌ మినహా అన్ని రకాల నెట్‌వర్క్‌లు నిలిచిపోనున్నాయి.