. రషీద్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన సునితా రెడ్డి
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై స్వర్గస్తులైన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎండీ.రషీద్ కుటుంబాన్ని శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పరామర్శించారు. ప్రజాభిమానాన్ని విశేషంగా చూరగొన్న రషీద్ ఖాన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు.రషీద్ ఖాన్ లేని లోటును అధిగమిస్తూ కుటుంబీకులంతా గుండె నిబ్బరం కలిగి ఉండాలని వారిలో మనోధైర్యాన్ని నింపారు.ఆమె వెంట జెడ్పీటీసీ ఆంజనేయులు,మాజీ సర్పంచి మాయిని శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.