క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్ లో గత మూడు రోజులుగా అలుగును చూసి గాంధీనగర్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
వింత జంతువును చూసిన గాంధీనగర్ వాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు దాని పేరు అలుగు అని, శాస్త్రీయ నామం ఫంగోలియన్ అని పిలుస్తారని తెలిపారు. ఇది క్రూర జంతువు కాదని, ప్రజలు భయపడాల్సిన పని ఏమీ లేదని, మనుషులను చూసినట్లయితే రాయిలాగా మారుతుందని అన్నారు. అలుగును తీసుకొని వెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు.
అలుగును పట్టుకొని అడవిలో వదిలిపెట్టిన అటవీ అధికారి




