Wednesday, 4 November 2026

రహదారి కోసం 500 టేకు చెట్ల నరికివేత

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సిరిచెలమ గ్రామానికి చెందిన గిరిజనులు రహదారి నిర్మాణం కోసం 500 టేకు చెట్లను మంగళవారం రాత్రి నరికివేశారు. ఈ రహదారి నిర్మిస్తే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ చేరుకునేందుకు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
కానీ, అటవీ అధికారులు అభ్యంతరం తెలపడంతో రహదారి నిర్మాణం నిలిచిపోయింది. దీంతో అగ్రహించిన గిరిజనులు మంగళవారం రాత్రి అటవీ అధికారులను నిర్బంధించి చెట్లను నరికివేశారు. ఈ విషయం పై అటవీ అధికారులు పెంబి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని అటవీ సిబ్బంది ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *