రాజకీయాలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు

 అర్హులైన ప్రతి వ్యక్తికి పెన్షన్ మంజూరు
* గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం
*నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నల్లబెల్లి సెప్టెంబర్ 23 ( జనం సాక్షి):
రాజకీయాలకతీతంగా తెలంగాణ ప్రభుత్వం అందరికి సంక్షేమ పథకాలను అందజేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ముచ్చింపుల, శనిగరం, కన్నారావుపేట ,మూడు చెక్కలపల్లి, కొండాపూర్, రాంపూర్ గ్రామాలలో నూతన పెన్షన్ కార్డులను, బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి వ్యక్తికి పెన్షన్ అందేలా చూస్తామని అన్నారు. ఏ ప్రభుత్వంలో మంజూరుకానన్ని పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసి ప్రజలకు అండగా నిలిచిందన్నారు.మండలంలోని అన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసి రోడ్లు వేయిస్తామన్నారు. అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీఓ కూచన ప్రకాష్, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.