Wednesday, 4 November 2026

రాజకీయ భీష్ముడిని కోల్పోయాం – మోహన్‌ బాబు

హైదరాబాద్‌, ఆగస్టు8(జ‌నం సాక్షి) : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి ప్రముఖ సినీ నటుడు ఎం.మోహన్‌బాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ భీష్మ పితామహుణ్ని కోల్పోయామని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విూడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
తన గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’, ‘బంగారక్క’ చిత్రాలకు స్వర్గీయ కరుణానిధి చేతుల విూదుగా అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. కరుణానిధి ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని అద్భుతమైన రచయిత, వక్త అని చెప్పారు. ఆయన మాటలు
ఉద్వేగపరుస్తాయని అన్నారు. కళైంగర్‌ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. కరుణానిధి మరణం చాలా బాధించిందన్నారు. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాథుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకుంటున్నానని మోహన్‌బాబు వెల్లడించారు.