రాజక్కపేట హై స్కూల్ లో బయోసైన్స్ కి టీచర్ నునియమించాలి.

డి.బి.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్.
దుబ్బాక సెప్టెంబర్ 22,( జనం సాక్షి )
రాజక్కపేట హై స్కూల్ లో బయోసైన్స్ కి టీచర్ ను నియమించాలని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో గురువారం రోజున లచ్చపేటలో దుబ్బాక ఎంఈఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ శేఖర్ మాట్లాడుతూ రాజక్కపేట గ్రామంలో ఉన్న హైస్కూల్లో గతంలో ఉన్న బయోసైన్స్ టీచరు అనారోగ్యంతో ఒక నెల సెలవులు తీసుకోవడం ఆ తర్వాతి నెలలో ఉపాధ్యాయుడు మరణించాడు.అనగా రెండు నెలలుగా బయోసైన్సుకి టీచర్ లేకపోవడం తో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.కావున బయోసైన్స్ కి టీచర్ ను నియమించి విద్యార్థులకు పాఠాలు బోధన చేయించాలన్నారు.