రాజగోపాల్ రెడ్డికి భారీ షాక్

మునుగోడు అక్టోబర్20(జనంసాక్షి):బిజెపి పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డిని బిజెపి పార్టీని మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.బిజేపి పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ మునుగోడు నియోజకవర్గంలో తన అనుచరులు రాజగోపాల్ రెడ్డి తీరని చూసి పార్టీ మారుతున్నారు.మునుగోడు, చండూరు, మర్రిగూడెం,రాజగోపాల్ రెడ్డి అత్యంత సనితులైన వారు కూడా టిఆర్ఎస్ పార్టీ వైపు చూసే పరిస్థితి ఉంది మునుగోడు మండల కేంద్రానికి చెందిన బిజెపి పార్టీ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తన అనుచరులతో పాటు బిజెపి పార్టీలో చేరారు. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా బిజెపిి పార్టీకి సేవలు అందించిన వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలో చేరడంతో తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆవేదన చెందుతూ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి యాదయ్య,మాధగోని నరేందర్ గౌడ్,పందుల రాజేశ్,పర్ణ అంతిరెడ్డి,నీరుడు రాజారం తమ అనుచరులతో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నలగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి,వేమిరెడ్డి నరసింహారెడ్డి,తదితరులు ఉన్నారు.