రాజాసింగ్ ను ఎన్ని కల్లో పోటిచేయ కుండ చేయాలి

రఝునాధపాలెం.జనంసాక్షి.రాజాసింగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించాలని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ భారత ఎన్నికల సంఘాన్ని కోరారు ఈ మేరకు బిజెపి ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే గా ఉండి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ లౌకికవాదానికి కట్టుబడాల్సిన వ్యక్తి ఇతర మతాన్ని కించపరచడం మత ఉన్మాదానికి అహంకారానికి నిదర్శనమని లింగాల రవికుమార్ మండిపడ్డారు ప్రజా ప్రతినిధిగా అన్ని మతాలను సమానంగా గౌరవించాలనే విషయం ప్రజాప్రతినిధి గా ఉన్న రాజాసింగ్ కు తెలియకపోవడం సిగ్గుచేటని లింగాల అన్నారు ఇతర మతాల పట్ల ఇతర కులాల ఆహారపు అలవాట్ల పట్ల కించపరుస్తూ మాట్లాడటం దుర్మార్గం అని రాజాసింగ్ ను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లింగాల రవికుమార్ విజ్ఞప్తి చేశారు అన్ని మతాల సారాంశం ధర్మం మానవతావాదమేనని సాటి మనిషి ని ప్రేమించడం గౌరవించడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశమని లింగాల రవికుమార్ అన్నారు కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని సహించేది లేదని లింగాల రవికుమార్ హెచ్చరించారు