Wednesday, 4 November 2026

రాజీవ్ గాంధీ జయంతి ని మరచిన కాంగ్రెస్ నేతలు

దంతాలపల్లి ఆగస్టు 20 జనం సాక్షి

భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిచిపోయారంటూ స్థానికులు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రామచంద్రనాయక్, నియోజకవర్గ బాధ్యులు మాలోతు నెహ్రూ నాయక్ ల ఆధ్వర్యంలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బల ప్రదర్శన చేసే వారు ఈరోజు ఏ ఒక్కరూ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించకపోవడంతో ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.