రాజేశ్వరరావుకు కలిసిన బిచ్కుంద నాయకులు

బిచ్కుంద ఆగస్టు 24 (జనంసాక్షి) నూతన తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన రాజేశ్వరరావుకి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు నాంపల్లి గల క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నాడు ఎంపీపీ అశోక్ పటేల్, నాల్చర్ రాజు, నాగ్నాథ్ పటేల్, వెంకట్రావు దేశాయ్ తదితరులు రాజేశ్వరరావను కలిసి పుష్పగఛ్చం అందజేసి శాలువ కప్పి అభినందనలు తెలిపారు.