కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి న రోజుఅని కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి అన్నారు . సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అల్మస్ గూడా గ్రామంలో రామిడి శూరకర్ణ రెడ్డి ఆధ్వర్యలో తెలంగాణ విమోచన దినోత్సవము , భారత ప్రధనమంత్రి నరేంద్ర మోడీగారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి పాల్గొన రామిడి స్వరూప భీంరెడ్డిగారి స్వచ్ఛంద సంస్థ ద్వారా శానిటేషన్ సిబ్బందికి బియ్యం కోడిగుడ్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించారు అని అన్నారు. అలాగే కెసిఆర్ అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవం జరపాలని అప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక మాత్రం విమోచన దినోత్సవాన్ని 8 సంవత్సరాలు నుంచి ఎంఐఎం పార్టీకి భయపడి విమోచన దినోత్సవం జరపలేదు.కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం జరుపుతోందని తెలుసుకొని జాతీయ సమైక్యత పేరుతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి విధంగా జరుపుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివరాం రెడ్డి , మహేందర్ రెడ్డి ,శ్రీధర్ నాయక్ ,రమేష్ , అడికే రవితేజ, సంతోష్ , శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..




