జనం సాక్షి జూలై 11 రాయికోడ్ మండల టిఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ అబేద్ మియా తన సొంత గ్రామమైన నాగ్వార్ లో ఆదివారం ఉదయం మండల కేంద్రమైన రాయికోడ్ తో పాటు అన్ని గ్రామాల్లో ముస్లిం మరియు హిందు సోదర సోదరిమనులకు బక్రీద్ మరియు ఏకాదశి పండగల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మండల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మండల వ్యాప్తంగా పడుతున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల కోఆప్షన్ మెంబర్ అబేద్ మియా అన్నారు. పాడుబడిన ఇల్లులో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. అత్యవసర సమయంలో సహాయం పొందుటకు స్థానిక ప్రజాప్రతినిధులకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ డయల్ 100 కు పోన్ చేసినట్లయితే సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని తాము కూడా అధికారులకు అందుబాటులో ఉండి వారికి సహకరిస్తామని తెలిపారు. అలాగే మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు.. ఈ పండుగ వేడుకల్లో పాషా పలేల్, మాలి పటేల్, హమీద్ మియా, యాశీన్ పటేల్, ఖిజర్, నిసర్, సయేద్, సద్దాం, అక్బర్, అబ్బు, ఆర్షద్, కలీమ్, రోషన్ తదితరులు పాల్గొన్నా
రాయికోడ్ మండల ప్రజలకు పండగల శుభాకాంక్షలు:




