రావణాసుర వధ కార్యక్రమ స్థల పరిశీలన చేసిన ఎస్సై ఓంకార్ యాదవ్

ములుగు బ్యూరో, అక్టోబర్01(జనం సాక్షి):-
ములుగు జిల్లా లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రావణాసురవధ కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని ములుగు ఎస్సై బొంకూరి ఓంకార్ యాదవ్ పరిశీలించారు.శనివారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్,సభ్యులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎస్సై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.ట్రాఫిక్ నియంత్రణ, వేదిక, తాగునీటి వసతి,రావణ విగ్రహ ఏర్పాటు, ఫైర్, అతిథులు తదితర అంశాలపై ఉత్సవ కమిటీతో చర్చించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం నిర్వహించిన మాదిరిగానే ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలు నిర్వహిస్తామని, భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.అన్ని అనుమతులు పొందినట్లు వివరించారు. అక్టోబర్ 5న జరిగే రావణాసురవధ కార్యక్రమానికి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని గండ్రకోట కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు నగరపు రమేష్, మాదరి జనార్థన్, పాడ్య రాజేందర్,డి.రాకేష్ రెడ్డి, చంటి,సంపత్, భూక్య కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area