వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
హైదరాబాద్,మార్చి2(జనం సాక్షి): రాష్ట్రంలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో కనీసం ఐదుగురు మృత్యువాత పడడ్డారు. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం రాణిపేట స్టేజీ సవిూపంలోని 44వ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి కీరదోసకాయ లోడుతో హైదరాబాద్ వస్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ బాలకృష్ణ (40) క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందాడని ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. మృతుడు సిద్దిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం తోగార్రాయి శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైక్‌లు పరస్పరం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు కోదాడ పట్టణం తమ్మరబండ పాలెంకు చెందిన అంజద్(20), బొమ్మకంటి అరవింద్(22)గా గుర్తించారు. మరో ఇద్దరు మైసయ్య, అనిల్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేళ్లచెర్వు జాతరకు బైక్‌పై ముగ్గురు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర శివార్లలోని మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో తొమ్మిది మంది ఉన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు దిబ్బు, గౌరవ్ సింగ్‌గా గుర్తించారు. గాయపడిన మరో ఏడుగురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ నుంచి సుచిత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు




